పాఠశాలలు, సంస్థలకు జాతీయ, రాష్ట్ర సెలవులతో సహా 2025కి సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. స్టడీ మెటీరియల్‌ను సేకరించడంతో పాటు, సంవత్సరానికి సంబంధించిన సెలవు క్యాలెండర్‌ను ఇటీవల ప్రకటించింది. పాఠశాలలకు 2025 సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇది అన్ని ఏపీ బోర్డు పాఠశాలలకు వర్తిస్తుంది. హాలిడే క్యాలెండర్ జాబితా అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ విడుదల చేసిన జాబితాలో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు కలుపుకొని మొత్తం 44 రోజులు సెలవులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం.. 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.
S. No. |
పండుగ |
తేదీ |
రోజు |
1
|
భోగి
|
13.01.2025
|
సోమవారం
|
2
|
మకర సంక్రాంతి
|
14.01.2025
|
మంగళవారం
|
3
|
కనుమ
|
15.01.2025
|
బుధవారం
|
4
|
రిపబ్లిక్ డే
|
26.01.2025
|
ఆదివారం
|
5
|
మహా శివరాత్రి
|
25.02.2025
|
బుధవారం
|
6
|
హోలీ
|
14.03.2025
|
శుక్రవారం
|
7
|
ఉగాది
|
30.03.2025
|
ఆదివారం
|
8
|
ఈద్-ఉల్-ఫిత్ర్ (రంజాన్)
|
31.03.2025
|
సోమవారం
|
9
|
బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
|
05.04.2025
|
శనివారం
|
10
|
శ్రీరామ నవమి
|
06.04.2025
|
ఆదివారం
|
11
|
డా. బ్రాంబేద్కర్ పుట్టినరోజు
|
14.04.2025
|
సోమవారం
|
12
|
శుభ శుక్రవారం
|
18.04.2025
|
శుక్రవారం
|
13
|
బక్రీద్ (ఈద్-ఉల్-జుహా)
|
07.06.2025
|
శనివారం
|
14
|
మొహర్రం
|
06.07.2025
|
ఆదివారం
|
15
|
వరలక్ష్మి వ్రతం
|
08.08.2025
|
శుక్రవారం
|
16
|
స్వాతంత్ర్య దినోత్సవం
|
15.08.2025
|
శుక్రవారం
|
17
|
శ్రీకృష్ణాష్టమి
|
16.08.2025
|
శనివారం
|
18
|
వినాయక చవితి
|
27.08.2025
|
బుధవారం
|
19
|
ఈద్ మిలాద్ ఉన్ నబీ |
05.09.2025
|
శుక్రవారం
|
20
|
దుర్గాష్టమి
|
30.09.2025
|
మంగళవారం
|
21
|
మహాత్మా గాంధీ జయంతి, విజయ దశమి
|
02.10.2025
|
గురువారం
|
22
|
దీపావళి
|
20.10.2025
|
సోమవారం
|
23
|
క్రిస్మస్
|
25.12.2025
|
గురువారం
|
S.No. |
పండుగలు |
తేదీ |
రోజు |
1
|
రిపబ్లిక్ డే
|
26.01.2005
|
ఆదివారం
|
2
|
ఉగాది
|
30.01.2021
|
ఆదివారం
|
3
|
శ్రీరామ నవమి
|
06.04.2020
|
ఆదివారం
|
4
|
మొహర్రం
|
06.07.2020
|
ఆదివారం
|
2025లో మొత్తం 23 సెలవు దినాలుగా పేర్కొంది ఏపీ సర్కార్. ఇందులో నాలుగు సెలవులు ఆదివారం వచ్చాయి. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం వచ్చాయి. అందుకే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో కేవలం 19 మాత్రమే ఉద్యోగులకు లభిస్తాయి. అక్టోబర్ 2 గాంధీజయంతి, విజయదశమి రెండు సెలవులు కూడా కలిసిపోయాయి. వీటితోపాటు 21 ఆప్షనల్ హాలిడేలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
ముందస్తు సమాచారంతో ఐదు సెలవుల దినాలను అధికారులు వాడుకోవచ్చు. ఇందులో కూడా ఈద్-ఈ- గదర్, మహలాయ అమావాస్య ఆదివారం వస్తున్నాయి. మే నవంబర్‌లో ఎలాంటి సెలవులు లేకపోగా.. జనవరి ఏప్రిల్, ఆగస్టులో ఎక్కువగా నాలుగు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా ఏడాదిలో పది నెలల్లో సెలవులు ఉన్నాయి.. రెండు నెలల్లోనే ఎలాంటి సెలవులు లేవని గమనించాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి