ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. 15 మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
పాడేరు వెళ్తున్న ఈ బస్సు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు డ్రైవర్ ఓ చెట్టు కొమ్మను తప్పించబోతుండగా, బస్సు లోయలోపడినోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు వెంటనే హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లోయలో పడిపోయిన బస్సు 100 అడుగుల లోయలో చెట్లలో చిక్కుకుపోయింది. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
అల్లూరి బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లా కలెక్టర్లకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నివాలని అన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయక చర్యలు అందాలని ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి