AP Weather Report: శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఆ వర్షపు నీరు కృష్ణా నదిలో కలుస్తోంది. దాంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,10,239 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 841.20 అడుగుల మేర నీరు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 63.6876 టీఎంసీల నీరు ఉంది. కాగా, ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో.. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇదిలాఉంటే.. తూర్పు-పడమర షీర్ జోన్ ఆక్షాంశం 18 ° ఉత్తరం వైపు 4.5 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల మధ్య సగటున సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రకారం ఇవాళ రేపు ఉత్తర తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా్లోనూ భారీ వర్షాలు ఒకటి రెండు ప్రదేశాలలో కురుస్తాయని చెప్పారు.
Also read:
Viral Video: ఛారిటీ మ్యాచ్ అన్నారు.. బ్యాట్‌లతో బాదుకున్నారు..!
Gold Price video: మరోసారి పసిడి పరుగులు..మళ్ళి పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా.. (వీడియో)