Andhra Pradesh: కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ.. టాప్‌లో ఉన్న రాష్ట్రాలివే..

|

Oct 05, 2024 | 9:27 PM

కిల్కారీ, మొబైల్ అకాడమీ కార్యకలాపాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించి గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ రెండు వినూత్న కార్యక్రమాలు ఐవీఆర్ టెక్నాలజీని ఉపయోగించుకుని బాలింతలకు, ఆరోగ్య కార్యకర్తలకు కీలక సమాచారం అందిస్తున్నాయి. దీంతోపాటు.. ముఖ్యమైన సేవలను అందిస్తున్నాయి.

Andhra Pradesh: కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ.. టాప్‌లో ఉన్న రాష్ట్రాలివే..
Kilkari And Mobile Academy
Follow us on

దేశంలో కిల్కారీ, మొబైల్ అకాడమీ కార్యకలాపాలను అమలు పరిచేందుకు న్యూఢిల్లీలో భారత ప్రభుత్వం, అర్మాన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. కిల్కారీ, మొబైల్ అకాడమీ కార్యకలాపాలను ఇప్పటివరకూ అమలు చేసిన 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, బీహార్ లు నిలిచాయి.

ఈ కిల్కారీ, మొబైల్ అకాడమీ కార్యకలాపాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించి గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ రెండు వినూత్న కార్యక్రమాలు ఐవీఆర్ టెక్నాలజీని ఉపయోగించుకుని బాలింతలకు, ఆరోగ్య కార్యకర్తలకు కీలక సమాచారం అందిస్తున్నాయి. దీంతోపాటు.. ముఖ్యమైన సేవలను అందిస్తున్నాయి.

వీడియో చూడండి..

మొబైల్ అకాడమీ తల్లి, పిల్లల ఆరోగ్యంపై ASHA సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన IVR-ఆధారిత మొబైల్ శిక్షణా కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తే భారత ప్రభుత్వం నుంచి ASHA సర్టిఫికేట్ లభిస్తుంది. గర్భం దాల్చిన నాల్గవ నెల నుండి పుట్టిన బిడ్డ సంవత్సరం వయస్సు వరకు కిల్కారీ సేవలందిస్తుంది. ఇది గర్భిణీలు, బాలింతలు, వారి కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించి అవగాహన కల్పిస్తుంది.

Kilkari And Mobile Academy

ఆంధ్రప్రదేశ్లోని 90 శాతం ASHA కార్యర్తలు మొబైల్ అకాడమీ కోర్సును 18 నెలల్లో పూర్తి చేశారని డిసెంబర్ 2024 నాటికి నూరు శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ మాతా శిశు సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ కె.వి.ఎన్.ఎస్. అనిల్ కుమార్ తెలియజేశారు. ఆరోగ్య కార్యకర్తలు క్షేత్ర స్తాయిలో విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ఉత్తమ విధానాలు అవలంబించడం ద్వారా కిల్కారీ, మొబైల్ అకాడమీ కార్యకలాపాలు మాతా శిశు సంరక్షణలో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి దోహదపడ్డాయని ఆయన వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..