Vangaveeti Radha Marriage: ఘనంగా వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక.. రాజకీయాలకు అతీతంగా హాజరైన పలువురు నేతలు

దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. రాధాకృష్ణ భార్య పుష్పవల్లి నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె అనే విషయం తెలిసిందే. వీరి వివాహానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పెళ్ళికి హాజరై సందడి చేశారు. తన వివాహ వేడుకకు హాజరైన పవన్‌ను..

Vangaveeti Radha Marriage: ఘనంగా వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక.. రాజకీయాలకు అతీతంగా హాజరైన పలువురు నేతలు
Vangaveeti Radha Marriage

Updated on: Oct 23, 2023 | 10:10 AM

విజయవాడ, అక్టోబర్ 23: దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. రాధాకృష్ణ భార్య పుష్పవల్లి నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె అనే విషయం తెలిసిందే. వీరి వివాహానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పెళ్ళికి హాజరై సందడి చేశారు. తన వివాహ వేడుకకు హాజరైన పవన్‌ను రాధాకృష్ణ సాదరంగా ఆహ్వానించాడు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కొద్దిసేపు రాధాతో ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను జనసేన తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

‘విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విజయవాడలోని పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారని’ ట్విటర్‌ పోస్టులో తెలిపారు.

ఇవి కూడా చదవండి

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జలీల్‌ఖాన్‌, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. కాగా వంగవీటి రాధా కృష్ణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారి 2004లో పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజక వర్గంలో విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నప్పటికీ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. త్వరలో వంగవీటి రాధా కృష్ణ జనసేనలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.