NRI Searching: శనక్కాయల సత్తియ్య కోసం ఎన్నారై అన్వేషణ.. కారణమేంటో తెలిస్తే సలామ్ కొడతారు..!

NRI Searching: అతను డబ్బుకు పేదవాడే కానీ.. మంచి మనసులో పేదవాడు కాదు. ఆ చిన్నారుల పట్ల అతను చూపిన పెద్ద మనసు.. 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది.

NRI Searching: శనక్కాయల సత్తియ్య కోసం ఎన్నారై అన్వేషణ.. కారణమేంటో తెలిస్తే సలామ్ కొడతారు..!
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 05, 2022 | 10:28 AM

NRI Searching: అతను డబ్బుకు పేదవాడే కానీ.. మంచి మనసులో పేదవాడు కాదు. ఆ చిన్నారుల పట్ల అతను చూపిన పెద్ద మనసు.. 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది. కాకినాడ బీచ్‌కు వెళ్లిన ఓ ఎన్నారై తన పిల్లలకు శనక్కాయలు కొనిచ్చాడు. ఆ వ్యాపారికి డబ్బులిద్దామని చూసేసరికి ఫర్సు మర్చిపోయామని గ్రహించి ఏం చేయాలో తోచని పరిస్థతిలో పడ్డాడు. అది గమనించిన శనక్కాయల వ్యాపారి సత్తియ్య పర్వాలేదు సర్‌.. అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎన్నారై మోహన్‌ కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. అయితే మోహన్‌ కుమారుడు ప్రణవ్‌ బీచ్‌రోడ్డులో ‘శనక్కాయల’ జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తుచేస్తూ సదరు చిరు వ్యాపారి సత్తియ్యతో దిగిన ఫొటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నారు. ఆ వ్యాపారికి ఎలాగైనా శనక్కాయల డబ్బులు తిరిగి ఇవ్వాలనుకున్నారు. దీంతో తనకు పరిచయుస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి విషయం చెప్పడంతో.. అతని కుటుంబం నాగులాపల్లిలో ఉంటుందని, రెండేళ్ళ క్రితమే సత్తియ్య చనిపోయాడని తెలుసుకున్నారు. సోంతూరుకు వచ్చిన మోహన్‌ కుటుంబం శనక్కాయల సత్తియ్య కుటుంబాన్ని కలిశారు. ఆనాడు బీచ్‌లో జరిగిన విషయం వారికి చెప్పి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో సత్తియ్య కుటుంబ సభ్యులకు రూ. 25 వేలు బహుమానంగా ఇచ్చారు. 12 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఇప్పటికీ గుర్తుంచుకుని, సదరు వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మోహన్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అభినందించారు.

Also read:

Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్‌’..సొగసు చూడతరమా..!

IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!

Sara Ali Khan : లవ్‌ అంటూ ఇద్దరిని ముంచావ్‌.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!