Ap night curfew : ఏపీలో ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు.. ఏయే కార్యకలాపాలకు వెసులుబాటు, వేటికి పూర్తి స్థాయి ఆంక్షలు.. ఒక లుక్

|

Apr 24, 2021 | 6:14 PM

Andhra pradesh night curfew : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలుకు విధివిధానాలు ఖరారు చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది...

Ap night curfew : ఏపీలో ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు.. ఏయే కార్యకలాపాలకు వెసులుబాటు, వేటికి పూర్తి స్థాయి ఆంక్షలు.. ఒక లుక్
Ap curfew
Follow us on

Andhra pradesh night curfew : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలుకు విధివిధానాలు ఖరారు చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 24 తేదీ రాత్రి నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో ఏ సేవలు అందుబాటులో ఉంటాయి, వేటిని పూర్తిగా మూసి ఉంచుతారు అనే విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశాలు
> ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్ లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యాకలాపాలకు మాత్రమే కర్ఫ్యూ టైమ్ లో పనిచేస్తాయి
> ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
> నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది
> ప్రభుత్వం నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి
> వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతినిస్తారు
> అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు
> ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి
> కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు
> రాత్రి పూట కర్ఫ్యూ తో పాటు నిబంధనల అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు

Read also : Lockdown : మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌ డౌన్‌ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?