Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు..

|

Feb 10, 2022 | 7:01 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయిన కారు.. అదుపుతప్పి బావిలోకి పడిపోయింది.

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు..
Car Accident
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయిన కారు.. అదుపుతప్పి బావిలోకి పడిపోయింది. ఎమ్మిగనూరు మండలం ఎర్ర కోట గ్రామ దగ్గర ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. హ్యూందాయ్ క్రెటా కారు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు మీదుగా వెళ్తోంది. ఎర్రకోట గ్రామం సమీపంలో ముందుగా ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అలా పక్కనే ఉన్న బావిలోకి పడింది. ఇది గమనించిన స్థానిక ప్రజలు.. 100 కు కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బావిలో పడిపోయిన కారును బయటకు తీశారు.

ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోడుమూరు కు చెందిన దశరథరామిరెడ్డి భార్య సుజాత రెడ్డి పేరు మీద ఉన్న కారు.. ఎమ్మిగనూరు లో ఉన్న పేషెంట్‌ను తీసుకువచ్చేందుకు హ్యుందాయ్ క్రెటా కారులో డ్రైవర్ రామాంజి వెళ్ళాడు. ఎర్ర కోట దగ్గర మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోగా.. కారు అదుపు తప్పింది. అదే సమయంలో బ్రేక్ ఫెయిల్ అయ్యింది. కరెంట్ పోల్‌ను డీకొని.. పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. స్పీడుమీదున్న కారు ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లడంతో 15 మీటర్ల లోతులో మట్టిలో ఇరుక్కుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్లను రప్పించి కారుకు తాడును కట్టి జేసీబీ సాయంతో బయటకు తీశారు. కాగా, కారు డ్రైవర్ రామంజి మృతి చెందాడు. కారులో ఎక్కువ మంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ లు అతి త్వరగా ముగించగలిగారు పోలీసులు.

Also read:

Valentine’s Day: ఫిబ్రవరి 14 పై విహెచ్‌పి, భజరంగ్‌ దళ్ నేతల కీలక ప్రకటన.. ఇంతకీ వారేమన్నారంటే..

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు తగ్గుతున్నారా? అయితే విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!

Viral Video: ఓ మై గాడ్.. అదృష్టం అంటే ఇతనిదే.. కొంచెం తేడా అయినా ప్రాణాలే పోయేవి..