Andhra Pradesh: ‘అలా ఫీలయితే.. కృష్ణా నదిలోకి ఈడ్చి కొడతారు‘.. ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
విజయవాడ టీడీపీలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని, దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమంటోంది. దేవినేని ఉమా పేరు ప్రస్తావించకున్నా..

విజయవాడ టీడీపీలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని, దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమంటోంది. దేవినేని ఉమా పేరు ప్రస్తావించకున్నా.. ఆయనే టార్గెట్‌గా కేశినేని నాని నిప్పులు చెరిగారు. ఇంతకీ బెజవాడ టీడీపీలో ఏం జరుగుతోంది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరైనా సరే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని ఇగోకు పోతే ప్రజలే సమాధానం చెప్తారని ఉమాపై సెటైర్లు వేశారు కేశినేని నాని. నేనే సామంత రాజునని విర్రవీగితే ప్రజలు కృష్ణానదిలో ఈడ్చి కొడతారన్నారు. పార్టీలో యువతరానికి అవకాశం ఇచ్చేందుకు సీనియర్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు కేశినేని నాని. జగన్ సర్కార్‌ను ఎదుర్కోవాలంటే యువత రావాల్సిందేనన్నారాయన. ‘నేనే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి. 8 సార్లు మంత్రి అవ్వాలంటే ప్రజలు ఊరుకోరు. నేను ఎంపీనని నాకు రెండు కొమ్ములున్నాయని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఉరికించి కొడతారు. ఇదేమీ రాజరిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యం.’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు కేశినేని నాని.
వైఎస్ జగన్‌ను ఎదుర్కోవాలంటే అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఎంపీ కేశినేని నాని. యూ లవ్ మీ.. ఐ డోంట్ లవ్‌యూ అంటే కుదరదన్నారు. యూ లవ్ మీ.. ఐ లవ్ యూ..అంటూ రెండువైపుల కలిసి వెళ్తేనే ఇది సాధ్యమన్నారు కేశినేని నాని. ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లు ఇవ్వాలని సూచించారాయన.




మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పైనా కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు వసంత ఏపార్టీలో ఉన్నారో ముందు చెప్పాలన్నారు. బెజవాడ ఎంపీగా వైసీపీ ఎమ్మెల్యే సభకు కూడా వెళ్తానని, వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు కాబట్టే.. మైలవరానికి ఎంపీ నిధులు ఇచ్చానని కేశినేని నాని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
