Monkeypox: ఏపీలో మంకీపాక్స్ కలకలం.. 8 ఏళ్ల బాలుడికి వైరస్‌ లక్షణాలు

|

Jul 30, 2022 | 12:36 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మంకీపాక్స్‌ మళ్లీ కలకలం రేపింది. గుంటూరు (Guntur) లో తొలి అనుమానిత కేసు నమోదైంది. ఒంటిపై తీవ్ర దద్దుర్లతో ఉన్న 8 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు.

Monkeypox: ఏపీలో మంకీపాక్స్ కలకలం.. 8 ఏళ్ల బాలుడికి వైరస్‌ లక్షణాలు
Monkeypox
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మంకీపాక్స్‌ మళ్లీ కలకలం రేపింది. గుంటూరు (Guntur) లో తొలి అనుమానిత కేసు నమోదైంది. ఒంటిపై తీవ్ర దద్దుర్లతో ఉన్న 8 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వైద్యులు మంకీపాక్స్‌గా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితుడి బ్లడ్‌ శాంపిల్స్‌ని తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నివేదికను అనుసరించి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు కొద్దిరోజుల క్రితమే వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా మంకీపాక్స్ అనుమానిత కేసు రావడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్‌ మరింత ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని.. అదే సమయంలో అజాగ్రత్త వద్దని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..