Minister Roja: కోడిని పట్టి పందెం ఆడిన రోజా.. నగరి నియోజకవర్గంలో పండగ సంబరాలు

| Edited By: Subhash Goud

Jan 18, 2024 | 7:27 AM

భర్త ను కుర్చీలో కూర్చోపెట్టి తమ అదృష్టం ఎలా ఉందో చిలక జోస్యం చెప్పించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగిరి డిగ్రీ కాలేజీ మైదానంలో నియోజకవర్గం లోని మహిళలందరికీ పోటీలు ఆటలు పోటీలు నిర్వహించిన రోజా బహుమతులు అందజేసారు. సంక్రాంతి ఆటలు పాటలతో పొంగళ్ళు పెట్టి సందడి చేశారు. నగరి నియోజకవర్గంలోని మహిళలందరితో కలిసి సంతోషంగా..

Minister Roja: కోడిని పట్టి పందెం ఆడిన రోజా.. నగరి నియోజకవర్గంలో పండగ సంబరాలు
Minister Roja
Follow us on

తిరుపతి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆర్కే రోజా నగరిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సందడి చేసింది. నగరి డిగ్రీ కాలేజీ మైదానంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో కొండ చుట్టు వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు జరగ్గా సంబరాలు నిర్వహించిన రోజా సరదా సరదాగా గడిపారు. సంబరాల్లో పాల్గొన్న ఆర్కే రోజా భర్త సెల్వమణి తో కలిసి ఎడ్ల బండి పై సరదాగా స్వారీ చేసారు. స్వయంగా కోడి ని పట్టుకుని ఢీ అంటే ఢీ అంటూ కోడిపందాలాడిన రోజా చిలక జోస్యం కూడా చెప్పించుకున్నారు.

భర్త ను కుర్చీలో కూర్చోపెట్టి తమ అదృష్టం ఎలా ఉందో చిలక జోస్యం చెప్పించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగిరి డిగ్రీ కాలేజీ మైదానంలో నియోజకవర్గం లోని మహిళలందరికీ పోటీలు ఆటలు పోటీలు నిర్వహించిన రోజా బహుమతులు అందజేసారు. సంక్రాంతి ఆటలు పాటలతో పొంగళ్ళు పెట్టి సందడి చేశారు. నగరి నియోజకవర్గంలోని మహిళలందరితో కలిసి సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని ముగ్గుల పోటీలు నిర్వహించి వారి ప్రతిభను గుర్తించేందుకు ఏటా సంబరాలు జరుపుతున్నామన్నారు మంత్రి రోజా.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి