Andhra Pradesh: చేసిందంతా వారే.. చంద్రబాబు, దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..

|

Jul 31, 2021 | 3:10 PM

Andhra Pradesh: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Andhra Pradesh: చేసిందంతా వారే.. చంద్రబాబు, దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..
Perni Nani
Follow us on

Andhra Pradesh: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుల, మత రాజకీయాలపై ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనా కాలంలో రాజ్యసభ స్థానాలు అగ్రవర్ణాలకు తప్ప ఎవరికీ ఇవ్వలేదన్నారు. బీజేపీ ఇచ్చిన రెండు కేంద్ర మంత్రి పదవులను కూడా కమ్మ, క్షత్రియ కులాలకు ఇచ్చారని అన్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం అలా కాదన్నారు. అన్ని విషయాల్లో సమన్యాయం పాటించే ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారని కొనియాడారు. కేబినెట్ పదవులు మొదలు.. అన్ని రకాల పదవుల్లోనూ 50 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ రెండవ డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్మన్‌లుగా 56 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు.

శనివారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. సంఘటనలు సృష్టించి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మైలవరంలో గొడవలు సృష్టించి, రాజకీయ లబ్ది కోసం దేవినేని ఉమ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నాని ఫైర్ అయ్యారు. ఉమాపై కేసులు పెట్టింది ఆయన వల్ల దెబ్బలు తిన్న దళితులు మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. గత ఐదేళ్లు అక్కడ ఉమా మైనింగ్ చేసి.. ఇప్పుడు మా ఎమ్మెల్యేకి అపాదించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పడానికి దేవినేని ఉమాకు అసలు సిగ్గే లేదని, చంద్రబాబు బుద్ధి ఏమైంది? అని ప్రశ్నించారు. కొండపల్లిలో మైనింగ్ చేసుకోవచ్చు అని జీవో ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం అని, దానిని బ్రోకరేజ్ చేసింది ఉమా అని మంత్రి నాని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనా కాలంలో రాజకీయాల కోసం పోలీసులను వాడుకున్నారని విమర్శించారు. రాజకీయ దురుద్ధేశాలతోనే కొండపల్లికి వెళ్తున్నారు కాబట్టే వారిని అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, టీడీపీ నేతలతో పాటు.. మైలవరం వైసీపీ నేతలను అరెస్ట్ చేశారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మహిళా పార్లమెంట్ సమావేశానికి వెళ్తున్న తమ ఎమ్మెల్యే రోజాని అడ్డుకుని అరెస్టు చెయ్యలేదా..? అంటూ చంద్రబాబు పాలనా కాలంలో జరిగిన పరిణామాలను మంత్రి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, అమిత్ షా, మోడీ లను అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదా? అని నిలదీశారు. తప్పుడు మైనింగ్‌కు అనుమతి ఇచ్చిన చంద్రబాబు, ఉమాపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరుతామని మంత్రి నాని తెలిపారు.

Also read:

SI Aneef Basha: నెల్లూరు జిల్లాలో ఎస్సై ఓవరాక్షన్.. మాస్క్ పెట్టుకోలేదని బూటు కాలితో తన్ని కొట్టుకుంటూ కార్లోకి ఎక్కించిన వైనం

Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు శుభవార్త..! నేరుగా ఇంటికి ఆన్‌లైన్‌ డెలివరీ..

Hydereabad: భాగ్యనగరంలో ట్రాఫిక ఆంక్షలు.. లాల్‌ దర్వాజా బోనాల జాతరకు సర్వం సిద్ధం..!