పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీలో వన మహోత్సవం.. మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

|

Aug 05, 2021 | 8:57 AM

వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ సర్కార్ నిర్ణయించింది.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీలో వన మహోత్సవం.. మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం జగన్‌
Jagananna Pacha Thoranam Programme
Follow us on

AP Jagananna Pacha Thoranam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమానికి సిద్ధమైంది. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి దాన్ని భారీ ఎత్తున చేపట్టింది.

జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ మొత్తం రెండు వేల మొక్కలను నాటతారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్‌ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటాలని సీఎం జగన్ ఆదేశించారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు.

వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎయిమ్స్‌ ఆవరణలో సీంఎ వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.పచ్చదనంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి బాలినేని చెప్పారు.

Read Also… Suicide: భర్త చేసిన అప్పు తీర్చేందుకు పుస్తెల తాడు తీసిచ్చిన భార్య.. అంతలోనే విషాదం..!