High Court: హైకోర్టులో ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో నకిలీ సర్క్యులర్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుద్యోగులు కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించి మోసపోతుండటంతో..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో నకిలీ సర్క్యులర్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుద్యోగులు కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించి మోసపోతుండటంతో అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. హైకోర్టు నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరుతో నకిలీ సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్లతో మోసాలకు పాల్పడుతున్న వైనంపై హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపర్తి గిరిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులిస్తే ఉద్యోగాలిస్తామని మోసగించే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
ఏపీ హైకోర్టు పేరుతో ఒక నకిలీ సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్‌పై గతంలో అడ్మినిస్ట్రేటివ్ రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని, వాస్తవానికి అలాంటి సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్లని హైకోర్టు జారీ చేయలేదని హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపర్తి గిరిధర్ ప్రకటించారు. మోసగాళ్లను గుర్తించడానికి హైకోర్టు అధికారులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
డబ్బులిస్తే ఉద్యోగాలిప్పిస్తామని, రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రభావితం చేస్తామని మోసగాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని హైకోర్టు సూచించింది. అభ్యర్థులను ప్రభావితం చేసేలా రిక్రూట్ మెంట్ ప్రక్రియపై కామెంట్లు చేయడం, పేర్లను ప్రస్తావించి డబ్బులు చెల్లించడానికి ప్రొత్సహించడం వంటివి చేయడానికి ప్రయత్నించే వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఏదైనా తప్పుడు వార్తలు, సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా వ్యాప్తి చేసే వారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిందని రిజిస్ట్రార్ తెలిపారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..