Andhra Pradesh: వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్ ను విచారించలేం.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

|

May 03, 2022 | 5:25 PM

వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడి విషయంలో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పు వెల్లడించింది. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో విచారించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అతను డబ్బులిచ్చి వెళ్లాడని, అతను నిందితుడు...

Andhra Pradesh: వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్ ను విచారించలేం.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
High Court
Follow us on

వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడి విషయంలో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పు వెల్లడించింది. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో విచారించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అతను డబ్బులిచ్చి వెళ్లాడని, అతను నిందితుడు ఎలా అవుతాడని వ్యాఖ్యానించింది. గుంటూరు(Guntur) జిల్లా నగరంపాలెంలో 2020లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఉన్న ఓ విటుడిని అదుపులోకి తీసుకుని గుంటూరులోని మొదటి తరగతి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచారు. అక్కడ అతనిపై కేసు పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో గుంటూరు ప్రత్యేక కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేయాలంటూ సదరు వ్యక్తి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతని పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2020 అక్టోబరు 10న పోలీసులు పిటిషనరుపై కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరిపి, సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారని తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు అక్కడ పిటిషనరు కస్టమర్‌గా ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారిపై కేసు పెట్టొచ్చు గానీ.. సొమ్ము చెల్లించి వెళ్లిన వ్యక్తిపై కేసు పెట్టి, ఎలా విచారిస్తామని వాదించారు. ఈ విషయంపై గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేశారు. వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టేసిందని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడిపై (కస్టమర్‌) కేసు నమోదు చేసి, కోర్టులో విచారించడానికి వీల్లేదని తీర్పునిచ్చారు. అతనిపై కింది స్థాయి కోర్టులో ఉన్న పెండింగ్ కేసును రద్దు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Vivo T1 Pro 5G: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..

Anand Mahindra: ఆమె స్టోరీపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. 700 మంది పురుషులకు సారధిగా మహిళ..