Andhra Pradesh High Court issues Notice: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
ఇదిలావుంటే, ఏపీ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం మార్చి 31న ముగియడంతో ఆయన స్థానంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియామకమయ్యారు. ఆమె కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. ఇక, అంతా సవ్యంగానే ఉంటుంది అనుకున్న సమయంలో కోర్టు ఆదేశాలతో షాక్ లు తగులుతున్నాయి. ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. ఇక, ఆమె ఎంపికపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అన్నది చూడాలి..
ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియలో భాగంగా.. ముగ్గురి పేర్లను జగన్ సర్కార్ ప్రతిపాదించింది. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా చివరికి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్‌గా అవకాశం దక్కింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రతిపాదన పంపగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే నీలం సాహ్ని ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. తాజాగా నోటీసులు జారీ చేసింది.
Read Also… AP Corona Cases: ఏపీలో కరోనా తగ్గుముఖం.. గణనీయంగా పెరిగిన రికవరీలు.. కొత్తగా ఎన్నంటే.!