Andhra Pradesh: అసెంబ్లీ వీడియో మార్ఫింగ్ పై ఏపీ ప్రభుత్వం సీరియస్‌.. విచారణకు ఆదేశిస్తూ..

|

Nov 15, 2022 | 8:22 PM

యూట్యూబ్‌ ఛానల్‌లో వైరల్‌ అవుతోన్న ఓ మార్ఫ్‌డ్‌ వీడియోపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చాలని ఉద్దేశపూర్వకంగా రూపొందించిన ఓ వీడియోకు సంబంధించిన అసలు విషయాన్ని ప్రజలకు వివరించారు...

Andhra Pradesh: అసెంబ్లీ వీడియో మార్ఫింగ్ పై ఏపీ ప్రభుత్వం సీరియస్‌.. విచారణకు ఆదేశిస్తూ..
AP Govt
Follow us on

యూట్యూబ్‌ ఛానల్‌లో వైరల్‌ అవుతోన్న ఓ మార్ఫ్‌డ్‌ వీడియోపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చాలని ఉద్దేశపూర్వకంగా రూపొందించిన ఓ వీడియోకు సంబంధించిన అసలు విషయాన్ని ప్రజలకు వివరించారు. ఫ్యాక్ట్‌చెక్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ ట్విట్టర్‌ హాండిల్‌ ద్వారా ప్రజలకు అవగహన కల్పించారు.

వివరాల్లోకి వెళితే.. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీరిస్తూ వీడియోను ఓ యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేశారు. రాష్ట్రంలో పలు మద్యం బ్రాండ్‌లను చంద్రబాబు నాయుడు పాలనలో తీసుకొచ్చాడని సీఎం తెలిపిన వీడియోను మార్ఫింగ్ చేసి తప్పుడు అర్థం వచ్చే విధంగా ఆ వీడియోను రూపొందించారు. ఈ విషయాన్ని వివరిస్తూ మార్ఫ్‌ వీడియో, రియల్‌ వీడియోను షేర్‌ చేసిన అధికారులు.. అసెంబ్లీలో వీడియోను మార్ఫ్‌ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఫేక్‌ వీడియోను రూపొందించి, వైరల్‌ చేస్తున్న యూట్యూబ్‌ చానల్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటించే ప్రయత్నం చేసిన సదరు యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులపై తదుపరి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..