Andhra Pradesh: కీలక వివరాలు లీక్ చేస్తున్నారంటూ ఆ ముగ్గురిపై వేటు.. ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు..

|

Aug 04, 2021 | 9:35 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖకు సంబంధించి కీలక వివరాలు..

Andhra Pradesh: కీలక వివరాలు లీక్ చేస్తున్నారంటూ ఆ ముగ్గురిపై వేటు.. ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు..
Andhra Pradesh Govt
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖకు సంబంధించి కీలక వివరాలు లీక్ చేస్తున్నారంటూ ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరిలో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్ కాగా, ఒక అసిస్టెంట్ సెక్రెటరీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారని భావించిన సర్కార్.. ఆర్థిక శాఖలో పని చేస్తున్న సెక్షన్ ఆఫీసర్స్ డి. శ్రీనిబాబు, కే. వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుని సస్పెండ్ చేసింది. అంతేకాదు.. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అప్పులకు సంబంధించిన ఆధారాలు చూపుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ఆరోపనలు చేస్తున్నారు. దాదాపు రూ. 41వేల కోట్ల ప్రజాధనానికి లెక్కలు లేవంటున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకు అప్పులు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇక 15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30,305 కోట్లు, కొవిడ్‌ కారణంగా మరో రూ. 19,192 కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

Also read:

Andhra Pradesh: ప్రమోషన్ అంటూ పార్టీ ఇస్తాడు.. ఆపై అందినకాడికి దోచుకెళ్తాడు.. వీడి మోసాలు అన్నీఇన్ని కావు..

Cyberabad Traffic Police: బీ అలర్ట్.. ఒక్క ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉన్నా ఇక అంతే సంగతులు..

Jhansi Railway Station: ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు!.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..