ఇక నుంచి ఏదైనా ఆఫ్‌లైనే. నో ఆన్‌లైన్. ఈ నిర్ణయాన్ని అందరూ అమలు చేయాల్సిందే. ఏపీలో అన్ని శాఖలకు జారీ అయిన ఆదేశాలివి. మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఇక్కడా జీవోలను ఆఫ్‌లైన్‌లో ఉంచాలని నిర్ణయించింది. గవర్నమెంట్ ఆర్డర్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇకపై తీసుకునే నిర్ణయాలను జీవోల రూపంలో ఆన్‌లైన్‌లో పెట్టొద్దని డిసైడ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను ఇన్నాళ్లు జీవో రూపంలో విడుదల చేసి ఆన్‌లైన్‌లో పెట్టేవారు. goir.ap.gov.inలో శాఖల వారీగా జీవోలను అందుబాటులో ఉంచేవారు. 2008 నుంచి జీవోలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతూ వస్తోంది. వివిధ శాఖల్లో నిర్ణయాలను తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేవారు. ఇకపై ప్రభుత్వ ఉత్వర్వులు ఆన్‌లైన్‌లో పెట్టొద్దని నిర్ణయించింది ప్రభుత్వం.
ఇటీవల కాలంలో చాలా వరకు జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు. కొన్నింటిని మాత్రమే అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు ఏకంగా అసలు ఏ జీవోను పెట్టొద్దని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు అందాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కాబట్టి ఇకపై జీవోలను ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉంచాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.
Also Read: వెంటాడిన పేదరికం.. “పై చదువులు చదవలేనేమో”.. ప్రాణం తీసుకున్న పూజిత