Andhra Pradesh: విద్యార్దులకు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా.. డైట్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వం..

|

Feb 21, 2023 | 6:16 AM

బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో చుదువుకుంటోన్న స్టూడెంట్లకు మంచి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం డైట్‌ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: విద్యార్దులకు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా.. డైట్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వం..
Andhra Pradesh
Follow us on

బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో చుదువుకుంటోన్న స్టూడెంట్లకు మంచి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం డైట్‌ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్‌ గురుకుల విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోజూవారీ చార్జీలను పెంచుతూ సీఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు..

3వ, 4వ తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు రూ. 1150 కి పెంచారు.

5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు రూ. 1400 కి పెంచారు.

ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు రూ. 1600 కి పెంచారు.

డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కాస్మెటిక్‌ చార్జీలకు కేటాయించిన బడ్జెట్‌ రూ.78 కోట్లుగా నిర్ణయించింది. ఈ చార్జీల పెంపు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ.48 కోట్లుగా మారినట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం డైట్‌ చార్జీలకు కేటాయించిన బడ్జెట్‌ రూ.755 కోట్లుగా పేర్కొంది. డైట్ చార్జీల పెంపుతో ప్రభుత్వంపై పడే రూ.112 కోట్ల అదనపు భారం పడనుంది.