Andhra pradesh: జగనన్న గోరు ముద్ద మెనూలో మరో పోషకాహారం.. మార్చి 2 నుంచి అమలులోకి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం 'జగనన్న గోరు ముద్ద' పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గుడ్డు, చిక్కీ, పొంగల్‌ వంటి ఎన్నో పోషకాహర..

Andhra pradesh: జగనన్న గోరు ముద్ద మెనూలో మరో పోషకాహారం.. మార్చి 2 నుంచి అమలులోకి..
Jagananna Gorumudda

Updated on: Feb 09, 2023 | 4:50 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ‘జగనన్న గోరు ముద్ద’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గుడ్డు, చిక్కీ, పొంగల్‌ వంటి ఎన్నో పోషకాహర పదార్థాలను అందిస్తోంది. వారం రోజుల పాటు షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తోంది. అయితే తాజాగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

జగనన్న గోరు ముద్దలో మరో న్యూట్రియెంట్‌ రాగి జావను జోడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావను అందించనున్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికే రాగిజావను జోడిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ఇందులో భాగంగా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..