Andhra Pradesh: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. హైస్కూల్స్ ను హైస్కూల్ ప్లస్ పాఠశాలలుగా మార్పు

|

Jul 08, 2022 | 7:33 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 292 హై స్కూల్స్ ను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ స్కూల్స్ లో ఎంపీసీ,...

Andhra Pradesh: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. హైస్కూల్స్ ను హైస్కూల్ ప్లస్ పాఠశాలలుగా మార్పు
Ap Muncipal Schools
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 292 హై స్కూల్స్ ను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ స్కూల్స్ లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నారు. ఈ పాఠశాలల్లో పీజీటీ లెవెల్ ఉన్నవారిని మాత్రమే టీచింగ్ (Teaching) చేసేందుకు తీసుకుంటామని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు 1,752 స్కూల్‌ అసిస్టెంట్లను 292 జూనియర్‌ కళాశాలల్లో పనిచేసేందుకు నియమిస్తామని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ వివరించారు. కాగా.. ఆగస్టు నెలలో 8వ తరగతి విద్యార్థులందరికీ రూ.12 వేలు విలువైన ట్యాబ్స్ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన జగనన్న విద్యాకానుక (Vidya Kanuka) కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ కామెంట్లు చేశారు. విద్యార్థుల కోసం బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. బైజూస్‌ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

మరోవైపు.. విద్యారంగంలో పలు మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రాథమిక విద్యలో తెలుగు స్థానంలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వివాదం రేపగా.. తాజాగా డిగ్రీ కాలేజీలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండేలా నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలను, ఇంటర్‌ కాలేజీలనూ పాఠశాల విద్య పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి విద్యా సంవత్సరాలను 5+3+3+4 గా విభజిస్తూ మే 31న రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌ నెం: 172ను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ఈ సర్క్యులర్ కారణంగా విద్యార్థులకు సమస్యలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.