Andhra Pardesh: ఏపీలోని విద్యార్థులకు సూపర్ న్యూస్.. వాటిని ఉచితంగా పంపిణీ.. ఫిబ్రవరి 3 నుంచే..

ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి సిద్దమైంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకుంటున్నవారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఫిబ్రవరి 3న గుంటూరు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది. అంధత్వ నివారణలో భాగంగా ముందడుగు వేసింది.

Andhra Pardesh: ఏపీలోని విద్యార్థులకు సూపర్ న్యూస్.. వాటిని ఉచితంగా పంపిణీ.. ఫిబ్రవరి 3 నుంచే..
Students

Updated on: Jan 29, 2026 | 2:50 PM

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనే పథకాలు అమలు చేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. త్వరలో ప్రభుత్వ స్కూళ్లల్లో ఆరోగ్య కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు స్కూళ్లోనే ప్రాధమిక చికిత్స ఈ కేంద్రాల ద్వారా అందించనుంది. అలాగే వీటి ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. పరిశుభ్రత, వఇతర ఆరోగ్య విషయాలపై డాక్టర్ల బృందంతో అవగాహన కల్పించనుంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఉచితంగా కళ్లద్దాలు

ఏపీలోని విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రొగ్రాం కోసం ప్రభుత్వం రూ.2.25 కోట్లు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3న అంధత్వ నివారణ కార్యక్రమం స్కూళ్లల్లో ప్రభుత్వం చేపట్టనుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఈ ప్రొగ్రాం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్లద్దాలు అందించనున్నారు.

నేత్ర సమస్యలు ఉన్నవారికి గుర్తింపు

స్కూళ్లల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా కంటి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించనున్నారు. కంటి సమస్యలు ఉన్నట్లు టెస్టుల్లో నిర్ధారణ అయితే ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. బయట టెస్టులు, కళ్లద్దాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది పెద్ద భారంతో కూడుకున్న పని. ఈ భారాన్ని తల్లిదండ్రులకు తప్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా చిన్న వయస్సుల్లోనే కంటి సమస్యలను గుర్తించడం ద్వారా నివారించవచ్చు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంధత్వాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాయి. కంటి సమస్యలతో బాధపడుతూ చాలామంది కంటి చూపును కోల్పోతున్నారు. ముందుగానే కంటిచూపును గుర్తించడం వల్ల భవిష్యత్తుల్లో పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకు అవసరమైన అడ్వాన్స్‌డ్ వైద్య చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి.