సమాజానికి చీడ పీడలా పట్టుకున్న అవినీతిని అంతమొందించేందుకు ఏపీ సర్కార్(Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్ యాప్‌ను రూపొందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో అధికారులు ఈ యాప్ రూపొందించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ(ACB) ‘14400 యాప్’ ను రూపొందించింది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం వినూత్న రీతిలో ‘దిశ’ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకొనేందుకు , పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మహిళలు ఫిర్యాదు చేసేందుకు, రూపొందించిన ఈ యాప్ విజయవంతమైంది. అదే తరహాలో అవినీతిపై ప్రజలు తక్షణం ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించింది. అవినీతిపై(Corruption in AP) ఫిర్యాదుల కోసం ఏసీబీ కొంతకాలంగా 14400 టోల్‌ఫ్రీ నంబర్ ను నిర్వహిస్తోంది. ఈ నంబర్ తో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్‌పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు.
అయినా.. కొందరు అధికారులు సిబ్బంది లంచాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా లంచాలు తీసుకోకుండా వారి ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అవినీతిని తక్షణం ఆధార సహితంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించేందుకే 14400 యాప్‌ను ఏసీబీ రూపొందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లా, మున్సిపాలిటీ, మండల, పంచాయతీ స్థాయిలో ఈ యాప్ వినియోగంపై అవగాహన సదస్సులు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అవగాహన కల్పిస్తారు.
14400 మొబైల్ యాప్‌లో ‘లైవ్ రిపోర్ట్’ ఉంటుంది. అధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నా, ఇతర అవినీతికి పాల్పడుతున్నా ఆ యాప్‌లో లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లైవ్ రిపోర్టింగ్ ఫీచర్‌లో ఫొటో,వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉన్నాయి. లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. లైవ్ వీడియో కూడా రికార్డు చేసి అప్‌లోడ్ చేయవచ్చు. అనంతరం లాడ్జ్ కంప్లైంట్ ( ఫిర్యాదు నమోదు) ఆప్షన్‌లోకి వెళ్లి సబ్‌మిట్ ప్రెస్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీ సుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral Video: గ్లాస్‌లో నీళ్లు తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Hyderabad: పుట్టినరోజే ఆఖరి రోజైంది.. రైలు ప్రమాద ఘటనలో మహిళ దుర్మరణం
KKR vs LSG IPL Match Result: ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. రెండు పరుగులతో విజయం సాధించిన లక్నో