Contract Lecturers: కాంట్రాక్ట్ లెక్చర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..

|

Jul 23, 2021 | 12:55 PM

Contract Lecturers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు..

Contract Lecturers: కాంట్రాక్ట్ లెక్చర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..
Cm Jagan
Follow us on

Contract Lecturers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు మేలు చేకూరుస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాదిపాటు పొడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని నిర్ణయించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు వారి సేవలకు విరామం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also read:

Diabetes: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయా..? పరిశోధకులు ఏమంటున్నారు..?

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

Fish Hunting: వర్షాలకు చెరువులుగా మారిన రహదారులు.. నడిరోడ్డుపై జనం చేపల వేట.. వైరల్ అవుతున్న దృశ్యాలు!