
మణిపూర్‌లో గిరిజనేతరులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై చెలరేగిన ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇప్పిటికే దాదాపు 52 మంది ఈ హింసాత్మక ఘటనలో మృత్యువాత పడ్డారు. మణిపూర్‌లో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు విద్యార్థులను తరలించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి.
అయితే మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ఓ విమానాన్ని ఏర్పాటు చేయగా.. ఇంపాల్ నుంచి కోల్‌కతాకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏయిర్‌పోర్ట్‌లలో ల్యాండ్ అయిన తర్వాత కూడా తమ స్వస్థలాలకు పంపించనున్నారు. ఈరోజు ఉదయం 9.35 AM గంటలకు 108 మంది విద్యార్థులు బయలుదేరనున్నారు. మరోవైపు ఉదయం 11.10 AM గంటలకు 49 మంది విద్యార్థులు కోల్‌కతాకు వెళ్లనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..