Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే మా ఓటు.. విభజనపై సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్..

|

Dec 08, 2022 | 1:52 PM

సమైక్య రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం అని అన్నారు సజ్జల.

Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే మా ఓటు.. విభజనపై సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్..
Sajjala Ramakrishna Reddy
Follow us on

సమైక్య రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం అని అన్నారు సజ్జల. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సజ్జల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరు, సుప్రీంకోర్టులో కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌పై కావాలనే ఆయన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు సజ్జల. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ మేం వదులుకోబోమన్నారు.

సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం స్పష్టం చేశారు సజ్జల. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని వ్యాఖ్యానించారు సజ్జల. ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, కావాలనే సీఎం జగన్‌పై ఆయన కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు రామకృష్ణా రెడ్డి.

ఇదిలాఉండగా.. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ అఫడవిట్ వేశారంటూ ఫైర్ అయ్యారు ఉండవల్లి. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పోరాటం చేసే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ కోసం పోరాటం చేయకపోతే జగన్ రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్లేనని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..