AP Politics: సంక్షోభంలో ఏపీ వ్యవసాయ రంగం.. సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

|

Sep 26, 2021 | 11:34 AM

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

AP Politics: సంక్షోభంలో ఏపీ వ్యవసాయ రంగం.. సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..
Yanamala
Follow us on

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. దాని అనుబంధ రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 70 శాతం నుంచి 50 శాతానికి పడిపోవడం సీఎం జగన్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగంలో రెండెంకల వృద్ధిరేటు సాధించిందన్నారు.

2017-18, 2018-19లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి 10.5 శాతం ఉండగా.. జగన్ పాలనలో పాలనలో 6.04 శాతం మాత్రమే వృద్ధి సాధించి.. 4.9 శాతం తగ్గుదల నమోదైందన్నారు. ఆక్వా కల్చర్‌లో 27.4 శాతం నుంచి 6.9 శాతానికి వృద్ధి పడిపోయిందన్నారు. హార్టికల్చర్ లో 17.7 శాతం నుంచి ఇప్పుడు 4.4 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ డెవలప్‌మెంట్ డౌన్ ట్రెండ్‌లో నడుస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో ఆహార పంటల దిగుబడులు కూడా తగ్గిపోయాయని అన్నారు. 2019-20తో పోల్చుకుంటే 2020-21లో 3 శాతం మేర దిగుబడులు తగ్గాయని వివరించారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని యనమల ఫైర్ అయ్యారు. రైతులు విక్రయించిన పంటలకు సరైన సమయంలో నగదు చెల్లించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆహార ద్రవ్యోల్బణం కూడా అత్యధికంగా 12.5 శాతం నమోదైందన్న ఆక్ష్న.. పెట్టుబడి వ్యయం పెరగడంతో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి రేటు కూడా దారుణంగా పడిపోయిందని తెలిపారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం విధానాలపై నిప్పులు చెరిగారు. సబ్సీడీపై అందించే డ్రిప్, వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీని పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు. పశుగణాభివృద్ధిలో క్షీణత కారణంగా గ్రామీణ ఆర్థిక స్థితిగతుల్లో తగ్గుదల కనిపిస్తోందన్నారు.

రాష్ట్రంలో షుగర్ ఇండస్ట్రీ దాదాపుగా అట్టడుగు స్థితిలో ఉందన్న ఆయన.. గుజరాత్‌కు చెందిన అమూల్ డైయిరీకి జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. సొంత రైతులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో గ్రామీణుల తలసరి ఆదాయం తగ్గిపోయిందన్నారు. రాష్ట్రం తిరోగమనంలో వెళ్తోందని, ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరవాలని హితవుచెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల బలోపేతానికి కృషి చేయాలన్నారు.

Also read:

Viral Video: వావ్.. వాట్ ఏ జోడి.. బుడ్డోడితో ఏనుగు సరదా ఆట.. చేస్తే ఫిదా అయిపోతారంతే..

Success Story: తండ్రి సైకిల్ మీద బట్టలను అమ్మే నిరుపేద.. పట్టుదలతో ఐఎస్ఎస్‌కు ఎంపికైన తనయుడు..

Hyderabad: మణికొండలో వ్యక్తి గల్లంతు.. 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా దొరకని ఆచూకి