Agriculture : ఏపీలో క్రాప్‌ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంట‌ల‌పై దృష్టి.. వైయస్‌ జయంతి రోజున కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, హబ్‌లు ప్రారంభం

|

Jun 10, 2021 | 7:18 AM

జులై 8న వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని.. అదే రోజున కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్‌లు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు...

Agriculture : ఏపీలో క్రాప్‌ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంట‌ల‌పై దృష్టి..  వైయస్‌ జయంతి రోజున కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, హబ్‌లు ప్రారంభం
Kannababu
Follow us on

Andhra Pradesh Crop planning : రాష్ట్రంలో క్రాప్‌ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంటలపై జాయింట్‌ కలెక్టర్లు దృష్టిసారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. పంటల ప్రణాళికలకు ఈ ఏడాది నుంచి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పిన ఆయన, ఆర్బీకేల మౌలిక సదుపాయాల కల్పనపై సూచనలిచ్చారు. జులై 8న వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని.. అదే రోజున కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్‌లు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. వరికి సంబంధించి సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు చాలా ముఖ్యమని, బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కన్నబాబు అన్నారు. వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కన్నబాబు ఈ సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఖరీఫ్ సన్నద్ధత, వైఎస్సార్‌ పొలంబడి, విత్తనాలు, ఎరువుల సరఫరాపై మంత్రి ఆరా తీశారు.

ఆంధ్రప్రదేశ్‌లో బత్తాయి, నిమ్మ పంటల సాగు.. దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. నిమ్మ, బత్తాయి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు చేసేలా సీఎం వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారని మంత్రి తెలిపారు.

రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ఆర్‌బీకేల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ, సమగ్ర యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించాలన్నఆయన.. సిట్రస్‌ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.

Read also : CM Jagan : ఈ ఉదయం ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పయనం.. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.!