Andhra Pradesh: టమాటా చేలో కలుపు తీస్తుంటే ఆ రైతు సుడి తిరిగిపోయింది.. లైఫ్ సెట్

|

Aug 10, 2022 | 9:04 PM

అదృష్టం ఎప్పుడు.. ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం. తాజాగా పొలంలో కలుపు తీస్తున్న రైతు సుడి ఒక్కసారిగా తిరిగిపోయింది. వివరాలు...

Andhra Pradesh: టమాటా చేలో కలుపు తీస్తుంటే ఆ రైతు సుడి తిరిగిపోయింది.. లైఫ్ సెట్
Representative image
Follow us on

Viral News: అతడో రైతు. పొద్దున్నే లేచి పొలానికి పోయి.. పనులు చేయడం,  ఇంటికి వచ్చి సేద తీరడం అతని దినచర్య. పంటపై వచ్చిన కొద్దో, గొప్పో డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరికి ఫేట్ మారిపోయే రోజు ఒకటి ఉంటుంది. మనదైన రోజును ఎవ్వడూ ఆపలేదు. డెస్టినీ బాగుంటే అదృష్టం చెత్త కుండీ గుండా, పెంట దిబ్బ గుండా, పంట చేను గుండా కూడా రావొచ్చు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా(Kurnool District)లో ఓ రైతుకు ఒక్క రోజుతో సుడి తిరిగిపోయింది. అదృష్టం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. సదరు రైతు టామాట తోట వేశాడు. ఇటీవల వర్షాలకు కలుపు పెరడంతో దాన్ని తీసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో కలుపు ఏరివేస్తుండగా.. కళ్లకు మెరుస్తూ ఓ రాయి కనిపించింది. పరీక్షగా చూసి అది వజ్రం అని నిర్ధారించుకన్నాడు. దీంతో అతడి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తుగ్గలి మండలం జి.ఎర్రగుడి(G Erragudi) గ్రామానికి చెందిన  రైతుకు ఈ అదృష్టం వరించింది. దొరికింది 10 క్యారెట్స్ డైమండ్ అని తెలుస్తోంది. విషయం తెలియడంతో.. వెంటనే జొన్నగిరి(Jonnagiri), పెరవళి సహా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు. వారిలో ఒకరు దాన్ని ఏకంగా 34 లక్షలకు దక్కించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. కాగా తొలకరి వానల తర్వాలు కర్నూలు జిల్లాలోని తుగ్గలి సహా పలు ప్రాంతాల్లో వజ్రాలు దొరకడం కామన్ అని స్థానికలు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..