Elephants Attack: చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం.. పంటలు నాశనం చేస్తూ చెరువుల్లో తిష్ట!

Elephants Attack: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేశాయి.

Elephants Attack: చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం.. పంటలు నాశనం చేస్తూ చెరువుల్లో తిష్ట!
Elephants Attack

Updated on: Jan 02, 2022 | 8:36 AM

Elephants Attack in Chittoor District: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేశాయి. కొబ్బరి చెట్లను నేలమట్టం చేశాయి. గుంపులుగా వచ్చి వందలాది ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. రైతులకు తీరని ఆవేదనను మిగిల్చాయి. చిత్తూరు జిల్లా రామపకుప్పం మండలంల సింగసముద్రంలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేశాయి. వందలాది ఎకరాల్లో కొబ్బరి చెట్లను నేలమట్టం చేశాయి. బీన్స్‌, టమోటా పంటలను నామరూపాలు లేకుండా చేశాయి. భారీగా పంటనష్టం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల విధ్వంసంపై వారంరోజులుగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి, తిష్ట వేసిన ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలు నాశనం చేస్తూ చెరువులో సేద తీరుతున్నాయి.