Andhra Pradesh Elections 2021: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలతో పాటు, మున్సిపాలిటీ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికలు కాకరేపాయి. ఇటు తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అయితే, ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగింది.
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల ఉప-ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెలువరించింది. మొత్తం మూడు పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 30న పోలింగ్ నిర్వహించింది. నవంబరు 2న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా.. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన చేపట్టారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్, తెలంగాణలోని హుజారాబాద్ నియోజకవర్గాలకు అక్టోబరు 30నే పోలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఉనికి లేకుండా వైసీపీ తన సత్తా చాటింది. మిగిలిపోయిన మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పంచాయతీ ఎన్నికలు స్థానికంగా దుమ్మురేపాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య పోటాపోటీగా ప్రచారం సాగింది. ఎన్నికలను ఎదుర్కొంటోన్న మున్సిపాలిటీల్లో- టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 16 నవంబర్ 2021న నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దఫా 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2020లో స్థానికు సంస్థల ఎన్నికలు నిర్వహించగా, వివిధ కారణాల దృష్ట్యా కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అయా జిల్లాలో వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగాయి.
నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. టీడీపీ అధ్యక్షడు.. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవి కాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగాయి. మొత్తం మిగిలిన 14 జడ్పీటీసీ స్థానాలకుగాను నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. 176 ఎంపీటీసీ స్థానలకు గాను 50 ఏకగ్రీవం అయ్యాయి. 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న కౌంటింగ్ జరపనున్నారు. అకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. మార్చ్ 14 వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌ల పరిధిలోని కేంద్రాల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. నవంబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీ కాలం నవంబర్ నెల 29తో ముగిసింది. ఈసారి ఆయన ఎన్నికల బరిలో లేరు. ఇక గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఎ.ఎస్.రామకృష్ణ పదవీ కాలం ముగిసింది. అయితే మరోమారు ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానంలో 17వేల 467 మంది ఓటర్లుండగా 116 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కృష్ణా–గుంటూరు స్థానానికి 19 మంది బరిలో ఉన్నారని, 13వేల 505 మంది ఓటర్లుండగా 111 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కాకినాడలోని జేఎన్‌టీయూ కళాశాలలో జరుగుతుండగా..కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కళాశాలలో జరుగుతోంది. కౌంటింగ్ నిమిత్తం 14 టేబుళ్లు ఏర్పాటయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తేలిపోవడంతో ఫలితాలు వెల్లడించారు. టీచర్స్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్ధి షేక్ సాబ్జీ 1537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షేక్ సాబ్దీకు 7 వేల 987 ఓట్లు రాగా, సమీప అభ్యర్ధి గంధం నారాయణరావుకు 6 వేల 453 ఓట్లు వచ్చాయి. గతంలో ఇదే స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యూటీఎఫ్ అభ్యర్దే విజయం సాధించారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిధిలో యూటీఎఫ్ బలంగా ఉండటమే విజయానికి కారణంగా తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతా ఓటు రెండవ రౌండ్ లెక్కింపులోనే షేక్ సాబ్దీ విజయం కైవసం చేసుకోవడం విశేషం.
మరోవైపు, కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు.. ప్రధాన పోటీ ఐదుగురి మధ్య నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు, మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 13 వేల 575 ఓట్లకు గానూ 12 వేల 554 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు (6,251) దాటడడంతో కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 6,153 ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6,153 ఓట్లు సాధించడంతో కల్పలత విజయం సాధించారు. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 19 మంది పోటీచేశారు. 12,554 మంది ఓటు హక్కును వినియోగించారు.
ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నాలుగోదశ ఫిబ్రవరి 21న జరగింది. మార్చి 10న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఎన్నికల కౌంటింగ్ చేపట్టారు. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చాలా సీట్లు గెలిచామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రచారం చేసుకున్నాయి.
ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ పోరులో వైసీపీ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. 11 కార్పొరేషన్‌లతో పాటుగా 74 మున్సిపాలిటీలను (ఎన్నికలు జరిగిన మొత్తం 75 మున్సిపాలిటీలకు) వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం తాడిపత్రి మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. మైదుకూరులో వైసీపీ కంటే టీడీపీ ఒక వార్డు ఎక్కువ సాధించినప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యులతో వైసీపీ ఆ పీఠాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు పెండింగ్‌లో ఉన్న ఏలూరు కార్పొరేషన్ కూడా ఆ తర్వాత వైసీపీ ఖాతాలోకే వెళ్లింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 17న నిర్వహించారు. రాష్ట్రంలో 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగాయి. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తైంది. పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల 85,416 మంది అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు.ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 5,480 సున్నితమైన, మరో 4,181 అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. కోవిడ్ బాధితులు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట వీరికి పీపీఈ కిట్లు సమకూర్చారు. కరోనా నేపథ్యంలో ఓటర్లను థర్మల్ స్కానింగ్ చేశాకే పోలింగు కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా సున్నిత, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్‌ను వెబ్ కాస్టింగ్ విధానంలో పరిశీలించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు.
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడ్డారు. ఈ పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగించి ఫలితాలను ప్రకటించారు. 13 జిల్లాల్లో 2,640 పంచాయతీలకు 26,851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటూ.. బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లిలో ఎన్నికలు జరుగుతాయి. గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక నిర్వహించారు. కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి ఈ ఏడాది నిర్వహించారు. 2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాన్ని అందుకుంటోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపును అందుకుంది.
నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా.. దర్శి మున్సిపాలిటీ (darsi municipality) మినహా మిగిలిన అన్ని చోట్ల విజయం సాధించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ పోరులో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే పెండింగ్‌లో ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌తో కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పోలింగ్ నిర్వహించింది. ముఖ్యంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా కుప్పంలో.. ఫ్యాన్ సునామీకి సైకిల్ కుప్పకూలింది. అటు.. దర్శి మాత్రమే టీడీపీ వశమైంది. ఆకివీడులో 3, దాచేపల్లి, గురజాలలో ఒక్కో స్థానాన్ని జనసేన గెలుచుకోగా.. బీజేపీ పత్తా లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో 11 స్థానాలు అధికార పార్టీ వశమయ్యాయి. నెల్లూరులో 54 డివిజన్‌లలో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న కుప్పం టీడీపీ చేజారింది. అక్కడ 25 స్థానాలకు గాను వైసీపీ 19 స్థానాల్లో గెలవగా టీడీపీ 6 స్థానాలకు పరిమితమైంది. ఇక గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోనూ వైసీపీ హవా సాగింది. దాచేపల్లిలో మొత్తం 20 స్థానాలకు గాను అధికార పార్టీ 11 వార్డులను గెలుచుకోగా 7 టీడీపీ, ఒకటి జనసేన, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇక గురజాలలో 20 స్థానాలకు గాను వైసీపీ 16, టీడీపీ 3, జనసేన ఒక వార్డును గెలుచుకున్నాయి. ఇదిలావుంటే, ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగాయి.
వీటితో పాటుగా గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 353 డివిజిన్లు, వార్డులకు.. 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 325 స్థానల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 1206 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు.
అయితే, కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా తలపడ్డాయి. మొత్తం 29 వార్డులు ఉండగా.. అక్కడ టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో విజయం సాధించాయి. మరో స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది. అయితే కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించింది టీడీపీ. ఎన్నిక విషయంలో దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
Read Also…. Year Ender 2021: ఈ ఏడాది ఎన్నికల్లో అధికార పార్టీదే హవా.. ఉప ఎన్నిక నిరాశపర్చినా.. ఎమ్మెల్సీల్లో కారుదే జోరు