Andhra Pradesh: ఆ ప్రాంతాలలో సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

|

Aug 23, 2021 | 9:16 AM

విద్యా సంస్థలకు దగ్గర్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మేవారికి హెచ్చరిక. ఇకపై ఆయా ప్రాంతాల్లో సిగరెట్లు అమ్మితే మీకు ఫైన్ తప్పదు. అవును విద్యా సంస్థల...

Andhra Pradesh: ఆ ప్రాంతాలలో సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక
Ap Government
Follow us on

విద్యా సంస్థలకు దగ్గర్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మేవారికి హెచ్చరిక. ఇకపై ఆయా ప్రాంతాల్లో సిగరెట్లు అమ్మితే మీకు ఫైన్ తప్పదు. అవును విద్యా సంస్థల ప్రహరీల నుంచి వంద గజాల (300 అడుగులు) లోపు ఎక్కడా సిగరెటు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ 2007 – 08లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖలు పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే.. ఇది అనుకున్న స్థాయిలో జరగడం లేదు. దీంతో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది.  కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యా సంస్థలకు దగ్గర్లో రూల్స్ అతిక్రమించి షాపుల్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించేవారికి రూ.20 నుంచి రూ.200 వరకు ఫైన్ విధించే అధికారం ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఉంటుంది. అయితే ఈ విషయం అనేక మంది తెలియదు. కొందరికి తెలిసినా లైట్ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లకు ఉన్న అధికారాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే విద్యా సంస్థల ప్రాంగణాల్లో ‘పొగాకు రహిత ప్రాంతం’ అని తెలిపేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలని, పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను 6నెలలకు ఒకసారి నిర్వహించాలని హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలను సంబంధిత ఏఎన్‌ఎంలు తమ మొబైల్‌ ఫోన్‌లలోని ‘హెల్త్‌’ యాప్‌లో అప్‌టూ డేట్ అప్‌లోడ్‌ చేసేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: పాలు అంటేనే ఆమడదూరం పరిగెడతారా? మరి కాల్షియం ఎలా? ఇవి ట్రై చెయ్యండి

“మేమే ముందు.. కాదు మేమే ముందు”.. పెళ్లి ముహూర్తం గురించి గుడిలో రెండు కుటుంబాల ఫైట్