AP Rain Alert: ఏపీలో ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక సూచనలు జారీ..

| Edited By: Ravi Kiran

Jul 12, 2022 | 9:02 AM

Andhra Pradesh: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి క్షణ క్షణానికి పెరుగుతోంది.

AP Rain Alert: ఏపీలో ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక సూచనలు జారీ..
Dhavaleshwaram
Follow us on

Andhra Pradesh: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి క్షణ క్షణానికి పెరుగుతోంది. గోదావరి ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ నదీ పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది. దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 12.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసింది విపత్తుల సంస్థ. తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలను ప్రజలకు సూచించారు అధికారులు. కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా ప్రకటించారు అధికారులు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..
1. 1070
2. 18004250101
3. 08632377118

మరో మూడురోజులు వర్షాలు..
సోమవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర.. పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నేడు ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం మరింత బలపడనున్నదని అంచనావేస్తున్నారు. మరోవైపు రుతుపవనాల ద్రోణి జైసల్మేర్‌, కోట, పెండ్రా రోడ్, బలంగిర్‌, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. దీంతో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. నేడు, రేపు పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రభుత్వం, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..