AP Weather Alert: వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకటన ప్రకారం.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాకు పిడుగుల హెచ్చరిక జారీ అయ్యింది.
శ్రీకాకుళం జిల్లా:
పాతపట్నం, సర్వకోట, హీరామండలం, లక్ష్మీనర్సుపేట
అల్లూరి సీతారామరాజు జిల్లా:
జి. మాడుగుల, చింతపల్లె, రాజవొమంగి, జికె వీధి, కొయ్యురు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేట
అనకాపల్లి జిల్లా:
దేవరపల్లి, చీడికాడ, నాతవరం, గొలుగొండ, మాడుగుల
విజయనగరం జిల్లా:
వేపాడ, శృంగవరపుకోట, గంట్యాడ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్.