Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Exams 2022: మ్యాథ్స్ ఎగ్జాం ప్రారంభానికి ముందే పేపర్‌లీక్‌.. ఇప్పటికే 69 మంది అరెస్ట్‌..

ఆంధ్రప్రదేశ్‌ టెన్త్ క్లాస్‌ ప్రశ్న పత్రాల లీక్‌ (Maths Question paper leak) వ్యవహారం తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి..ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో మే 2న గణిత పరీక్ష ప్రారంభానికి ముందే సెల్‌ ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రం లీక్‌ అయినట్టు గుర్తించారు. దీనిపై..

AP 10th Exams 2022: మ్యాథ్స్ ఎగ్జాం ప్రారంభానికి ముందే పేపర్‌లీక్‌.. ఇప్పటికే 69 మంది అరెస్ట్‌..
Ap 10th Exams
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2022 | 4:20 PM

Paper leak before starting of Maths exam in AP SSC class Exams 2022: ఆంధ్రప్రదేశ్‌ టెన్త్ క్లాస్‌ ప్రశ్న పత్రాల లీక్‌ (Maths Question paper leak) వ్యవహారం తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి..ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో మే 2న గణిత పరీక్ష ప్రారంభానికి ముందే సెల్‌ ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రం లీక్‌ అయినట్టు గుర్తించారు. దీనిపై ఏలూరు పోలీసులు (Eluru Police) విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మండవల్లి పోలీస్‌ స్టేషన్‌లో మే 3న ఉదయం నుంచి పలు కోణాల్లో ఈకేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మే 2న మ్యాథ్స్ ప్రశ్న పత్రం లీక్‌ చేసి.. కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలోని పాఠశాలల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జవాబుపత్రాలు చేరవేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షా కేంద్రం లేదు. అయినా, ఇక్కడి నుంచి జవాబు పత్రాలు వివిధ ప్రాంతాలకు చేరినట్టు పోలీసులు గర్తించారు. ఏలూరు జిల్లాలోని మండవల్లి తదితర ప్రాంతాలకు వాట్సప్‌ ద్వారా జవాబు పత్రాలు చేరవేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు టీచర్లతో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. మే 3న మండవల్లి పోలీస్ స్టేషన్లో అనుమానితులను విచారిస్తున్నారు. మే 2న గణిత పరీక్ష ప్రారంభానికి ముందే సెల్‌ఫోన్‌ ద్వారా ప్రశ్నపత్రం బయటకు రావడం, దానికి అనుగుణంగా జవాబు పత్రాలు తయారు చేసి వాటిని జిరాక్స్‌ తీయించి వాట్సప్‌ ద్వారా పంపించారు. కాసేపట్లో మీకు జవాబుపత్రాలు వస్తాయనే సందేశాలు కూడా కొందరు ఉపాధ్యాయుల సెల్‌ఫోన్లలో ఉన్న నేపథ్యంలో వీటన్నింటిని పోలీసులు పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఉన్న టీచర్లకు ఎవరెవరికి వాట్సప్‌ ద్వారా జవాబుపత్రాలు చేరాయనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పామర్రు, నందివాడ, గుడివాడ, ఏలూరు జిల్లా మండవల్లిలో టీచర్లకు జవాబుపత్రాలు చేరినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు కొంత మంది టీచర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మండవల్లిలో ఉపాధ్యాయులు, సహాయ సిబ్బందితో కలిపి మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇక పేపర్‌ లీకుల వ్యవహారంలో గత వారంలో 45 మంది టీచర్లతో సహా మొత్తం 69 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియాకు తెలిపారు. ఇందులో 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఈ లీకుల పర్వంలో పాత్ర పోషించినవారిలో పాఠశాల అటెండర్లు, వాటర్ బాయ్‌లు, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు.. మే 9 వరకు జరుగనున్నాయి. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. మొదటి పరీక్ష అయిన తెలుగు, ఆ తర్వాత ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి.

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో వరుస పేపర్‌ లీకేజ్‌లకు చెక్‌పెట్టేందుకుగానూ.. అధ్యాపక సిబ్బందికి టెక్నాలజీ వినియోగంపై అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పరీక్షలు జరుగుతున్న అన్ని పరీక్షా కేంద్రాలను నో ఫోన్‌ జోనులుగా ప్రకటించారు. అంటే ఉపాధ్యాయులు, అధికారులతో సహా ఎవ్వరికీ.. ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలైనా పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదన్నమాట. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఆకస్మిక తనిఖీలు చేసేందుకు అన్ని జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా నియమించింది.

Also Read:

AP Inter Exams 2022: తెలుగు రాష్ట్రాల్లో రేపట్నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!