Parvathipuram Manyam: ఆ ఊరిలో అన్ని మేనరికపు పెళ్లిళ్లే.. కానీ ఇంటికో కన్నీటి వ్యధ!
పార్వతీపురం మన్యం జిల్లా పాంచాలి అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో మేనరిక పెళ్లిళ్లు జరగడం సంప్రదాయం. అక్కడ వివాహాలు బయట గ్రామాల వారితో కాకుండా అదే గ్రామంలోని వారితో జరుగుతుంటాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే తమ ఆడపిల్లను ముందుగా తన మేనమామ లేదా మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తారు. అలా స్వయాన బావ, మరదలు లేకపోతే అప్పుడు మరొక సమీప బంధువుతో మేనరిక వివాహాలు జరుగుతాయి. అదే ఇప్పటికీ అక్కడ ఒక సంప్రదాయంగా..
విజయనగరం, అక్టోబర్ 29: పార్వతీపురం మన్యం జిల్లా పాంచాలి అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో మేనరిక పెళ్లిళ్లు జరగడం సంప్రదాయం. అక్కడ వివాహాలు బయట గ్రామాల వారితో కాకుండా అదే గ్రామంలోని వారితో జరుగుతుంటాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే తమ ఆడపిల్లను ముందుగా తన మేనమామ లేదా మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తారు. అలా స్వయాన బావ, మరదలు లేకపోతే అప్పుడు మరొక సమీప బంధువుతో మేనరిక వివాహాలు జరుగుతాయి. అదే ఇప్పటికీ అక్కడ ఒక సంప్రదాయంగా వస్తుంది. మేనరిక వివాహాల వల్ల ఇంట్లో ఆడపిల్ల కాబట్టి తమ తాతదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటారని వారి కుటుంబసభ్యుల నమ్మకం.. అలాంటి మేనరికపు వివాహాలు ఇప్పటి నుండి కాదు తరతరాలుగా ఈ గ్రామంలో కొనసాగుతున్నాయి. ఈ పెళ్లిళ్ల వల్ల కుటుంబాలు అన్నీ కలిసే ఉంటాయి. అలాగే కష్టసుఖాల్లో కుటుంబాలన్ని అండగా ఉంటాయి అనేది ఈ గ్రామస్తుల ఉద్దేశ్యం.
అందుకోసం మేనరికపు పెళ్లిళ్ల వైపు మొగ్గు చూపుతుంటారు ఈ గ్రామస్తులు. అయితే అందరికీ సంతోషంగా కనిపిస్తున్న మేనరికపు దంపతుల్లో మాత్రం బయటకు కనిపించని, ఎవరికీ చెప్పుకోలేని నరకం వారిని నిత్యం వేధిస్తూనే ఉంటుంది. మూడు వందల కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో మేనరికపు పెళ్లిళ్లే ఉన్నాయి. మేనరిక పెళ్లిళ్లతో చూసే వారికి ఆ దంపతులు ఆనందంగా కనిపిస్తున్నా లోలోన వారి కన్నీటి భాధలు మాత్రం ఎవరికీ కనిపించవు. అందుకు కారణం పుట్టే బిడ్డలు ఏదో ఒక రుగ్మతతో పుట్టడమే కారణం. మేనరికపు పెళ్ళిళ్లు చేసుకున్న దంపతుల పిల్లలో కొందరికి బుద్ది మందగిస్తే, మరికొందరికి ఎదుగుదల లేకపోవడం కనిపిస్తుంది.. ఇంకొందరికి గుండెజబ్బులు, కంటి చూపు లోపం, వినికిడి సమస్య తో భాధ పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది తల్లులకు కడుపులో బిడ్డ కడుపులోనే మరణిస్తే, మరికొందరికి పుట్టిన తరువాత మరణిస్తున్నారు.
కొంత మందిలో ఒకరు, ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు పుట్టినవారు పుట్టినట్లే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.. తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకొని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక. అయితే ఇక్కడ మాత్రం మేనరిక పెళ్లిళ్ల ఆనందం వెనుక కన్నీటి వ్యధలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిసి కూడా మేనరికపు పెళ్లిల్లే చేసుకుని అంగవైకల్యంతో పుట్టిన పిల్లలను చూసి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇలా వీరి భాధలు అన్నీ ఇన్ని కావు. తీవ్ర మానసిక వేదనతో అనునిత్యం కాలం గడుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేనరికపు పెళ్ళిళ్లు చేసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. మేనరికపు పెళ్లిళ్ల వల్ల ఖచ్చితంగా ఆరోగ్యకర దుష్ప్రభావలు ఉంటాయని అంటున్నారు. జనటిక్ సమస్యల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు డాక్టర్లు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.