Andhra Pradesh Crime News: అధికారిక వాట్సప్‌ గ్రూప్‌లో ‘ఆమె’ ఫోన్ నెంబర్.. మరో పోలీసు కానిస్టేబుల్‌పై వేటు.. అసలేం జరిగిందంటే..

|

Jul 20, 2021 | 1:47 PM

Nandyal Matka Case: కర్నూలు జిల్లా నంద్యాల త్రీటౌన్ వాట్సప్ గ్రూప్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారిక వాట్సప్ గ్రూప్‌లో

Andhra Pradesh Crime News: అధికారిక వాట్సప్‌ గ్రూప్‌లో ‘ఆమె’ ఫోన్ నెంబర్.. మరో పోలీసు కానిస్టేబుల్‌పై వేటు.. అసలేం జరిగిందంటే..
Suspend
Follow us on

Nandyal Matka Case: కర్నూలు జిల్లా నంద్యాల త్రీటౌన్ వాట్సప్ గ్రూప్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారిక వాట్సప్ గ్రూప్‌లో మట్కా డాన్ కూతురు నెంబర్ ఉండటానికి కారణమైన మరో పోలీస్ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. గతంలో త్రీటౌన్‌లో పని చేసి.. ప్రస్తుతం చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కార్తిక్ రెడ్డిని అధికారులు స్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే.. ఈనెల 13వ తేదీన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో.. నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొలిమిపేటకు చెందిన చాంద్ బాషా మట్కా నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులకు దిమ్మతిరిగే విషయం తెలిసిందే. చాంద్ బాషా కూతురు సెల్ నెంబర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ అఫిషియల్ వాట్సప్ గ్రూప్‌లో ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ నెంబర్‌ను వాట్సప్ గ్రూప్‌ నుంచి తొలగించారు. అయితే ఈ విషయం పై అధికారులకు తెలియడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో తొలుత కానిస్టేబుల్ హరిప్రసాద్ ప్రమేయం ఉందని గుర్తించిన అధికారులు.. అతన్ని సస్పెండ్ చేశారు. తాజా విచారణలో మరో కానిస్టేబుల్ కార్తిక్ రెడ్డి ప్రమేయం బయటపడటంతో.. అతని కూడా సస్పెండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రమేయం కూడా ఉన్నట్లు విచారణాధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ అయ్యేలోపు ఈ కేసులో ఎంతమందిపై వేటు పడుతుందో మరి.

Also read:

Wife Kills Husband: ఐదేళ్ల తరువాత బయటపడిన పచ్చి నిజం.. భర్తను ఎంత క్రూరంగా చంపిందో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు..!

Andhra Pradesh: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం.. అక్కడ బోటు కనిపించడంతో..

Tirumala: మళ్లీ మొరాయించిన టీటీడీ సర్వర్లు.. దొరికిందే ఛాన్స్‌గా రెచ్చిపోతున్న మాయగాళ్లు..