ఏపీలో తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య.. గడిచిన 24 గంటల్లో 104 మందికి కరోనా

|

Feb 02, 2021 | 7:37 PM

గడిచిన 24 గంటల వ్యవధిలో 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఏపీలో తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య.. గడిచిన 24 గంటల్లో 104 మందికి కరోనా
Coronavirus Cases In AP
Follow us on

AP Corona cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒక దశలో రికార్డుస్థాయిలో నమోదైన కోవిడ్ కేసులు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా ఇవాళ ఇక్కరోజు మరో ఇద్దరు కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, దీంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,004కి చేరింది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,156 మంది కరోనా రాకాసి బారినపడి మృతి చెందారు. ఇక, గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 147మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,651కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,197 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,31,89,103 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.

Read Also… బ్రిటన్ వాసులకు కొత్త గుబులు.. మరో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చిందన్న శాస్త్రవేత్తలు