AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌ను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి.. వేలలో నమోదైన కొత్త కేసులు..

|

Apr 10, 2021 | 7:17 PM

AP Corona Cases Updates: సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడే..

AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌ను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి.. వేలలో నమోదైన కొత్త కేసులు..
Coronavirus
Follow us on

AP Corona Cases Updates: సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ వందల సంఖ్యలోనే నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు ఏకంగా వేలకు చేరుకుంది. క్రమంగా ఆ సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం 2వేలకు పైగా కేసులు నమోదవగా.. ఇవాళ ఏకంగా 3వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 31,929 మంది నుంచి సాంపిల్స్ సేకరించగా.. 3,309 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఇక కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొరు చొప్పున బాధితులు ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,053 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,666 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా లెక్కలతో కలుపుకుని కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,21,906కి చేరింది. ఇక 8,95,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,291 మంది మృత్యువాత పడ్డారు.

Also read:

అక్కడి పరిపాలన మహిళలదే.. పురుషులకు కనీసం గుర్తింపు కూడా లేదు.. ఈ విషయాలు తెలిస్తే మీ దిమ్మతిరుగుద్ది

పోలీస్ కుక్కలకి కూలర్లు.. మెరుగైన విచారణకు దోహదపడతాయని విజయనగరం జిల్లా ఎస్పీ కొత్త స్టెప్

తన ఊపిరితిత్తులు కరోనా సోకిన భార్యకు ఇచ్చి ఊపిరి పోసిన భర్త.. జపాన్ లో సక్సెస్ అయిన లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్!