AP Contractors Protest: నాడు పోషకులం… నేడు యాచకులం అంటూ ఏపీలో.. పోరుబాట పట్టిన కాంట్రాక్టర్లు

|

Oct 08, 2021 | 2:16 PM

Andhra Pradesh Contractors Protest: విజయవాడలో కాంట్రాక్టర్లు పోరుబాట పట్టారు. అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ తమ ఆవేదనను తెలియజేశారు..

AP Contractors Protest: నాడు పోషకులం... నేడు యాచకులం అంటూ ఏపీలో.. పోరుబాట పట్టిన కాంట్రాక్టర్లు
Andhra Pradesh Contractors
Follow us on

Andhra Pradesh Contractors Protest: విజయవాడలో కాంట్రాక్టర్లు పోరుబాట పట్టారు. అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ తమ ఆవేదనను తెలియజేశారు. నాడు పోషకులం… నేడు యాచకులం అంటూ ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు. మా బిల్లులు చెల్లించండి-మా ప్రాణాలు కాపాడండి, మేము ఉంటాము మీ వెంటే-మేము మిగిలి ఉంటే అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఆస్తులు పోయి అప్పులు మిగిలాయ్-పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తమకు మరణమే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, పేమెంట్స్ చెల్లించలేని పనులను రద్దుచేసి తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు

నిధులు, నిర్మాణ స్థలం, డ్రాయింగ్ అఫ్రూవల్స్ లేకుండా టెండర్లు పిలవొద్దని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. నవరత్నాలు తరహాలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. కాంట్రాక్టర్ ల వేదన వినేందుకు సీఎం జగన్ సమయం ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.

Also Read:

Jagan: 11న తిరుమలకు ఏపీ సీఎం.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న జగన్.

ఈ గుడిసెలో వాష్‌రూమ్ లేదు.. ధర ఎంతో తెలిస్తే షాకే.. ప్రత్యేకతలు వింటే షేకే.!