AP Jagananna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు.. జగనన్న తోడు లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం జగన్‌

కరోనా కష్ట కాలంలో చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి పది వేల చొప్పున లబ్దిదారుల ఖాతాకే జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

AP Jagananna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు.. జగనన్న తోడు లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం జగన్‌
Cm Jagan

Updated on: Jun 08, 2021 | 1:16 PM

AP CM YS Jagan releases Jagananna Thodu Amount: కరోనా కష్ట కాలంలో చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి పది వేల చొప్పున లబ్దిదారుల ఖాతాకే జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానిపై వడ్డీపై భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుతం 3 లక్షల 70 వేల 458 మందికి 370 కోట్లను అందిస్తోంది.

జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని.. వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అప్పుల ఊబి నుంచి గట్టేక్కించేందుకు వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు.
Read Also…..  PM Kisan: రైతులకు శుభవార్త.. ఈ సంవత్సరం మీ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.36,000.. ఎలాగంటే..