CM YS Jagan: దేదీప్యమానంగా ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

|

Oct 12, 2021 | 4:50 PM

శరన్నవరాత్రి వేడుకలతో ఇంద్రకీలాద్రి వెలిగిపోతోంది. కనకదుర్గమ్మ ఆలయంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

CM YS Jagan: దేదీప్యమానంగా ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
Ys Jagan Durga Temple
Follow us on

AP CM YS Jagan at Durga Temple: శరన్నవరాత్రి వేడుకలతో ఇంద్రకీలాద్రి వెలిగిపోతోంది. కనకదుర్గమ్మ ఆలయంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు, ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సీఎం జగన్‌ సమర్పించారు.

దుర్గమ్మ ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎం జగన్‌కు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్‌ జగన్‌.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం వైఎస్ జగన్‌.

ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్‌ జగన్‌.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.

Read Also…  Prakash Raj Press Meet: ”మా” కు పోటీగా ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్..?? లైవ్ వీడియో