AP CM YS Jagan Delhi tour: కొద్దిసేపటి కిందటే కొత్త జిల్లాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఢిల్లీ టూర్‌కు సిద్ధమయ్యారు. రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరించి కొత్త జిల్లాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా ప్రధాని మోడీతో మాట్లాడతారని సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక.. మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది.
రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై మోడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర మంత్రి అమిత్‌షాతోనూ సీఎం భేటీకి సీఎంవో అపాయింట్‌మెంట్ కోరింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హస్తిన పర్యటనలో ఉన్నారు.. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం కూడా వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీకి చేరుకోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ సైతం ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కుదిరితే కేంద్రమంత్రులతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
Read Also…. AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్ .. రేపు దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం..