YSR Bheema: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలకు అండగా నిలిచేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ బీమా పథకం కింద పలు కుటుంబాలకు బుధవారం నాడు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ పథకంలో భాగంగా అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆర్థిక సాయం చేయనున్నారు. మొత్తం 12,039 బాధిత కుటంబాలకు రూ. 254 కోట్లు చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు కంప్యూటర్ బన్ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల్లోనూ నిర్వహించనుండగా.. ఆయా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇదిలాఉంటే.. ఈ వైఎస్సార్ బీమా పథకాన్ని 2020 అక్టోబర్ 21వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ పథకం కింద అనుకోని విపత్తుల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 12,039 కుటుంబాలకు చెందిన వారు తమ పెద్దను కోల్పోగా వారందరికీ ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. అయితే, ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ.. పేర్లు నమోదు చేసుకోకముందే చనిపోయిన వారికి కూడా బీమా పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైఎస్సార్ బీమా సాయం ఇలా..
1. 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి సాధారణ మరణం పొందితే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు
2. 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు..
3. 51–70 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.3 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించనున్నారు.
CM Jagan Live:
Also read:
FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?
మయన్మార్ సరిహద్దులో పట్టుబడిన తలనీలాలపై దుమారం.. ప్రచారంపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు