AP CM Jagan: ఈ నెల 9న ఒడిశా పయనంకానున్న సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి

|

Nov 04, 2021 | 11:23 AM

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరిహద్దు రాష్ట్రాలతో సంఖ్యత నెరిపే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా సీఎం జగన్..

AP CM Jagan: ఈ నెల 9న ఒడిశా పయనంకానున్న సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
Cm Jagan Tour
Follow us on

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరిహద్దు రాష్ట్రాలతో సంఖ్యత నెరిపే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి.. త్వరలో మూడేళ్ల పూర్తి చేసుకోనున్నారు.  ఈ సమయంలో పాలనలో తనదైన మార్కు చూపించే దిశగా పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో ఉన్న సరిహద్దు వివాదం, నీటి వివాదాలను పరిష్కరించుకునేందుకు ముందుకొచ్చారు.  ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు సమయం కేటాయిస్తే.. వస్తానని ఓ లేఖను రాశారు. సీఎం జగన్ ఆలోచనలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుకూలంగా స్పందించారు. ఒడిశా రమ్మనమని ఆహ్వానించారు.

దీంతో సీఎం జగన్ ఈ నెల 9వ తేదీన భువనేశ్వర్ కు వెళ్లనున్నారు.  సీఎం నవీన్ పట్నాయక్ తో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పోలవరం, జంఝావతి రిజర్వాయర్‌ ముంపు సమస్యల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇరువురు ముఖ్యమంత్రులు కలసి జలవనరుల శాఖ అధికారులతో  స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Also Read: రంగును చూసి కాదు..పోషకాలను చూసి బ్లాక్ ఫుడ్స్‌ని తినండి.. ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో..