AP CID Warning: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సీఐడీ సీరియస్.. ఆస్తులు అటాచ్‌ చేస్తామని వార్నింగ్

|

Nov 09, 2023 | 8:45 AM

ఇకపై ప్రజాప్రతినిధులు, మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. అసభ్యకరమైన పోస్టులు చేసినా, ఫొటో మార్ఫ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్‌ చేసిన వారి కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

AP CID Warning: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సీఐడీ సీరియస్.. ఆస్తులు అటాచ్‌ చేస్తామని వార్నింగ్
Cid Declares War Against Social Media Trolls
Follow us on

ఇకపై ప్రజాప్రతినిధులు, మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. అసభ్యకరమైన పోస్టులు చేసినా, ఫొటో మార్ఫ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్‌ చేసిన వారి కేసులు నమోదు చేసి, పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమన్నారు. రూల్స్‌ ఎవరు ఉల్లంఘించిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. పలు సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టామని, త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌ గుర్తించామని తెలిపారు. త్వరలో నిందితుల ఆస్తులు అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయన్నారు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా చర్యలు ఉంటాయని చెప్పిన ఆయన, ఇప్పటికే కొన్నింటిని తొలగించామని వెల్లడించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టినవారిపైనా చర్యలు తప్పవన్నారు.

మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు సంజయ్‌. సోషల్‌ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. గతేడాది 1,450 పోస్టులు..ఈ ఏడాది 2,164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించామన్నారు. కొందరు ఇతర దేశాల నుంచి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు సీఐడీ చీఫ్‌ సంజయ్‌. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించామని చెప్పారు. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపామని వివరించారు. అనుచిత పోస్టులతో అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సీఐడీ చీఫ్ సంజయ్ కోరారు.

మొత్తానికి రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని ఏపీ సీఐడీ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…