
AP CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. సీఎస్‌గా సమీర్ శర్మకు పదవీకాలాన్ని మరో 6 నెలల పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30తో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పొడిగిస్తూ జీవో జారీ చేసింది. దీంతో 2022 మే 31 వరకు సీఎస్‌గా సమీర్ శర్మ కొనసాగుతారు. ఇదిలావుంటే, 6నెలల పాటు ఆయన పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ యూనియన్ సెక్రెటరీ సంబంధిత ఉత్తర్వులను జారీచేశారు. రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించారు.
Ap Cs
Read Also… Rayalaseema: సీమకు జల’సిరి’.. ఉప్పొంగిన హృదయాలు.. రిజర్వాయర్‌లో ఈత కొట్టిన ఎంపీ