AP CM YS Jagan meets Governor: ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. రెండేళ్ల పరిపాలన, రాష్ట్ర ప్రగతి, నామినేటెడ్ పదవులపై చర్చ..!

|

Jun 14, 2021 | 6:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశమయ్యారు.

AP CM YS Jagan meets Governor: ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ..  రెండేళ్ల పరిపాలన, రాష్ట్ర ప్రగతి, నామినేటెడ్ పదవులపై చర్చ..!
Ap Cm Ys Jagan Mohan Reddy Meets Governor Biswabhushan
Follow us on

AP CM YS Jagan meets Governor Biswabhushan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశమయ్యారు. ఈ సాయంత్రం ఐదుగున్నర గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లిన సీఎం జగన్.. సుదీర్ఘంగా దాదాపు 40 నిమిషాలు పాటు గవర్నర్‌తో చర్చించారు. రెండేళ్ల పరిపాలన, రాష్ట్ర ప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై నివేదిక అందించినట్లు సమాచారం. ఇక, రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కరోనా పరిస్థితులపై జగన్ గవర్నర్ కు వివరించినట్లు సమాచారం.

అలాగే ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇందుకు సంబంధించిన విషయాలను గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఇద్దరి పేర్లపై గవర్నర్ అభ్యంతరం చెబుతున్నారని సమాచారం. ఇద్దరిపై కేసులున్న నేపథ్యంలో గవర్నర్ విముఖత వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదం తెలపాలని గవర్నర్‌ను సీఎం జగన్ కోరారు. ఈ నలుగురు ఎమ్మెల్సీ పేర్లపై కూడ జగన్ చర్చించినట్లు సమాచారం.

Cm Ys Jagan Mohan Reddy Meets Governor Biswabhushan

ఇక, రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా చర్చించిన్నట్లు సమాచారం. 80 కార్పొరేషన్లు, 960 డైరెక్టర్ల పదవుల భర్తీకి సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్‌ సూచనలను సీఎం తీసుకున్నారు. అలాగే, తాజా రాజకీయ పరిణామాలపైనా గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారు.

Ys Bharathi Meets Ap Lady Governor

Read Also…  Govt. Lands sale : ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసింది : హరీశ్ రావు