విశాఖ నగరం ఆందోళనలతో మార్మిగింది. అటు కార్మికులు, ఇటు క్యాబ్ డ్రైవర్లు.. సమస్యల సాధన కోసం రోడ్డెక్కారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు జీవీఎంసీ కార్మికులు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు, ఆందోళనల నేపథ్యంలో కోర్టులు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రజల కోసం కార్మికులు నిరంతరం కష్టపడుతున్నారన్న కార్మిక సంఘం నేతలు.. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. అప్పుడు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ప్రకటించారు. గాంధీ విగ్రహం దగ్గర చేపట్టిన నిరసనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరోవైపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కమిషన్ భారం తగ్గించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఏప్రిల్ 5న చల్లో ఢిల్లీకి పిలుపునిచ్చిన డ్రైవర్లు.. తమ సమస్యలు పరిష్కారించాలని కోరారు. క్యాబ్ డ్రైవర్లకు పీఎఫ్, ESI కల్పించాలని డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేరళ తరహాలో 8 శాతం కమిషన్‌తో ప్రభుత్వ యాప్ నిర్వహణలో వాహనాలు నడపాలన్నారు డ్రైవర్లు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..